| Daily భారత్
Logo




ఆస్పత్రిలో రౌండ్స్‌ వేస్తుండగా.. గుండెపోటుతో కార్డియాక్‌ సర్జన్‌ మృతి

News

Posted on 2025-08-30 19:10:39

Share: Share


ఆస్పత్రిలో రౌండ్స్‌ వేస్తుండగా.. గుండెపోటుతో కార్డియాక్‌ సర్జన్‌ మృతి

డైలీ భారత్, చెన్నై:చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియాక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డా. గ్రాడ్లిన్‌ రాయ్‌ (39) బుధవారం విధుల్లో ఉన్న సమయంలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

 ఆసుపత్రి వార్డుల్లో రౌండ్స్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.వెంటనే తోటి వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. కార్డియాలజీపై లోతైన అవగాహన ఉన్న, ఎప్పుడూ జాగ్రత్తలు పాటించే ఒక కార్డియాక్‌ సర్జన్‌.. గుండెపోటుతోనే మృతి చెందడం వైద్య వర్గాలను షాక్‌కు గురి చేసింది. 

యువతలో పెరుగుతున్న హార్ట్‌అటాక్‌ కేసులకు ప్రధాన కారణాలు ఒత్తిడి, ఎక్కువసేపు పని చేయడం, అనారోగ్యకర జీవనశైలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

కొందరు నిద్ర, రెస్ట్ లేకుండా డబుల్ షిఫ్ట్‌లలో పని చేయడంతో గుండెమీద తీవ్ర ఒత్తిడి పడుతుందంటున్నారు. 

అలాగే వ్యాయామం లేకపోవడం, ఆహారం తినే వేళల్లో మార్పులు, టెన్షన్‌తో కూడిన జీవనశైలి కూడా హార్ట్‌అటాక్స్‌కు దారితీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >