Posted on 2025-09-01 19:24:26
తన సొంత ఖర్చుతో బాధితులకు బియ్యం బస్తాలు, బెడ్షీట్లు పంపిణీ..
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ మండలంలో ఇటీవల కురిసిన వరద బీభత్సానికి తీవ్రంగా నష్టపోయిన వాడి, హునాజీపేట, కొండూర్, చుట్టుపక్కల తండాలలో తీవ్రంగా అన్ని కోల్పోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ధైర్యం నింపడానికి ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన సొంత ఖర్చులతో సుమారు 500 బియ్యం బస్తాలు, బెడ్ షీట్లను బాధితులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ఇదివరకే నిజామాబాద్ రూరల్ మండలంలో ఇటీవల నెలకొన్న వరద ప్రభావం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. తప్పకుండా వరద ముంపునకు గురైన బాధితులకు తమ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని ఆయన బాధితులకు భరోసానిచ్చారు. అకస్మాత్తుగా వచ్చిన వరద బీభత్సం వల్ల ఎంతోమంది ఆస్తి నష్టం తో పాటు, పంట పొలాలు, ఇండ్లు చాలా వరకు ధ్వంసం అయ్యాయని ఆయన అన్నారు. తాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >