| Daily భారత్
Logo




బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ మాజీ సీఎం కూతురు కవిత సస్పెండ్..

News

Posted on 2025-09-02 11:48:54

Share: Share


బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ మాజీ సీఎం కూతురు కవిత సస్పెండ్..

కవిత రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా చర్చలు.

బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ చేయడంతో తీవ్ర నిరాశలో కవిత అనుచరులు, అభిమానులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం ప్రకటించాయి. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కానీ బహిష్కరించలేదు. సస్పెండ్ చేస్తే మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంత కాలం తర్వాత వారిలో మార్పు వచ్చి, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేయొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఈటల రాజేందర్, ఆలె నరేంద్ర, రెహమాన్ లాంటి కీలక నేతలను బహిష్కరించింది. బహిష్కరిస్తే తిరిగి పార్టీలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు.

అయితే మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో ఇంటిపక్కనే మూడంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే టిఆర్ఎస్ పేరూ పరిశీలనలో ఉందని, ఇప్పటికే ఈ పేరుకు ప్రాచుర్యం ఉండటంతో జనాల్లోకి వెళ్లడం సులభం అని భావిస్తున్నారని కవిత అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదేళ్లపాటు నిజామాబాద్ ఎంపీగా చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో ఆమె అనుచరులలో నూతన ఉత్తేజం కలిగించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండగను అంతర్జాతీయంగా విదేశాలకు సైతం తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. అయితే ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకున్న నాటకీయ పరినామాల నడుమ మంగళవారం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ కు కల్వకుంట కవితకు ఎనలేని సంబంధం ఉంది.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >