Posted on 2025-09-06 17:13:13
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 11 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా జిల్లా కేంద్రంలో వాడవాడల పలు గణేష్ మండలిల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు కి ఆయా గణేష్ మండలి నిర్వహకులు నిమజ్జనం చేయడానికి భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జిల్లా కేంద్రంలో నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువ గా కొనసాగుతుంది. భారీ ఎత్తైన విగ్రహాలను సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు అటు ఉమ్మేడ, ఇటు బాసర గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడానికి ముందే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే ప్రకారంగా నిమజ్జన శోభాయాత్రలకు విగ్నేశ్వరుడుని ప్రతిష్ట చేసిన ఆయా గణేష్ మండలి నిర్వాహకులు శోభ యాత్రగా ప్రశాంతంగా తరలిస్తున్నారు. చిన్న చిన్న గణపతులు ఎత్తు తక్కువ గల గణపతులను జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని వినాయకుల బావిలో నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిపి వందల సంఖ్యలో పోలీసులను గట్టి బందోబస్తు కోసం ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిష్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికప్పుడు శోభయాత్ర జరుగుతున్న తీరును సీసీ కెమెరాలు, ను సిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >