| Daily భారత్
Logo




భార్యపై కన్నేశాడని స్నేహితుడి హత్య

News

Posted on 2025-09-08 18:05:28

Share: Share


భార్యపై కన్నేశాడని స్నేహితుడి హత్య

డైలీ భారత్, హైదరాబాద్:అంబర్ పేట్‌లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు.

మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు స్నేహితులు. ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడుప్పల్ ద్వారకా నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు బీహార్‌కు చెందిన వ్యక్తులు. తన భార్యపై షోరబ్ కన్నేశాడని జావేద్ అనుమానించాడు. ఈ విషయంపై పలుమార్లు షోరబ్‌ను జావేద్ మందలించాడు. అయినా కూడా షోరబ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన జావేద్ హత్యకు ప్లాన్ చేశాడు.

అమీర్ హుల్ హక్ సహాయంతో అంబర్ పేట్‌లోని మూసీ ప్రాంతంలో మహమ్మద్ జావేద్ హత్యకు ప్లాన్ వేశాడు. ఇద్దరు కలిసి షోరబ్‌కు పూటుగా మద్యం తాగించారు. మద్యం మత్తులోకి వెళ్లాక మెడకు వైర్లు చుట్టి హత్య చేశారు. జావేద్, అమీర్ కలిసి షోరబ్‌ మృతదేహాన్ని మూసీలో పడేశారు. షోరబ్ స్నేహితుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >