| Daily భారత్
Logo




అన్ని దానాల్లో కన్నా అవయవ దానం మిన్న

News

Posted on 2025-09-13 16:37:46

Share: Share


అన్ని దానాల్లో కన్నా అవయవ దానం మిన్న

అవయవాలు దానం చేసిన రాజేష్ కుటుంబాన్ని అభినందించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సృష్టిలో అన్ని దానాల్లో కంటే అవయవ దానాలు చేయడం ఎంతో మిన్న అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన  బుర్ర రాజేష్ గౌడ్ మరణించిన అనంతరం అవయవాలు మరొకరికి దానం చేసినందుకు వారి కుటుంబాన్ని అభినందించారు. ముందుగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి   రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత  అవయవాలు దానం చేయడానికి వారి కుటుంబం ముందుకు రావడం ఎంతో  కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రాజేష్ భార్య, తల్లిదండ్రులు మరియొక ప్రాణాలను కాపాడాలని అవయవాలు దానం చేయడానికి అంగీకరించినందుకు  అభినందనీయమని అన్నారు. శనివారం రోజు బుర్ర రాజేష్ గౌడ్  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంస్కరణ సభలో మాట్లాడుతూ  ఈ రోజుల్లో  చాలామంది  బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోతున్నారని, వారి కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేయడానికి అంగీకరిస్తే, అతని వల్ల మరొక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు.కండ్లు, కాలేయం, కిడ్నీలు,గుండె వంటి అవయవాలను దానం చేసి ఇతరులను కాపాడమే అన్నారు. ఎన్నో సంస్థలు అవయవ దానాలపై  అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసు బాబు, ధర్మ గౌడ్, శ్యామ్ సన్, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.


Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >