Posted on 2025-09-14 09:48:40
నిబంధనలు విరుద్ధంగా రెండు చోట్ల గన్ లైసెన్స్ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే
సంఘటనపై పోలీసుల లోతైన విచారణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు మరో వివాదం అలుముకుంది. ఆయన మాబాద్ పోలీసులు సీజ్ చేయడంతో మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం హెచ్చరికలతో మరింత ముదిరింది. గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు పోలీసుల పైనే వ్యక్తిగత దూషణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం నిజామాబాద్ కమిషనరేట్ కు వెళ్లారు. అయితే, అక్కడ పోలీసులు జీవన్ రెడ్డికి ఒకేసారి రెండు బ్యోగస్ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట గన్ లైసెన్స్ ఉండాలి కానీ ఇందుకు విరుద్ధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఒక లైసెన్స్ సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో మరొకటి నిజామాబాద్ పరిధిలో ఉన్నట్లు తేలింది. దీంతో
సీపీ సాయి చైతన్య వెంటనే జీవన్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేశారు. 2016 నుంచే ఆయన లైసెన్సులు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత దూషణలు, గన్ సీజ్ చేయడం ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని కూడా తొలగించవంతో జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సీపీపై వ్యక్తిగత ఆరోపణ లకు దిగారు. ఈ చర్య పోలీసు అధికారులు సంఘాన్ని కలవరపరిచింది. పోలీసుల సంఘం విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తప్పులన్నీ ఆయన చేసి పోలీసులపై అనవసర ఆరోపణలు చేస్తున్నరు. పింక్ బుక్లో పేర్లు రాస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడటం చూసుకోవాలి. మళ్లీ పోలీసులపై వ్యక్తిగత రూపణలు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం. రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారు అని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ సంఘటనలో జీవన్ రెడ్డి వర్సెస్ పోలీసుల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >