Posted on 2025-09-14 06:46:05
డైలీ భారత్, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్న కుమారుడిని ఓ తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ (35), ఆయన భార్య సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు అనాస్ (3) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో తన కుమారుడిని హత్య చేయాలని అక్బర్ ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి, భార్య విధులకు వెళ్లిన సమయంలో, దిండుతో చిన్నారిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి, మూసీ నదిలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని మొదటిగా ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు. తరువాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, తండ్రిని గమనించిన పోలీసులు, అతడిపై అనుమానంతో గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చివరకు తానే కుమారుడిని హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ అక్బర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం కోసం రక్షణ బలగాలు మూసీలో గాలింపు చర్యలు చేపట్టాయి
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >