Posted on 2025-09-15 08:42:24
రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిసిన బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బోధన్ నియోజకవర్గంలోని సాలూర మంజీరా పరివాహక ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలైన రైతులకు అదేవిధంగా కందకుర్తి గోదావరి సరిహద్దు గ్రామాలైన నీలా, బోర్గాం, తాడి బిలోలి, రెంజల్, నవీపేట్ లోని కొన్ని ప్రాంతాల గ్రామాల రైతులు వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెండో పంటకు విత్తనాలను వెంటనే ప్రభుత్వం సరఫరా రైతులకు అందివ్వాలి అన్నారు . వరద ప్రభావానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ఆయన కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు వరద ప్రభావానికి దెబ్బతిన్న రైతులకు ఎకరానికి ప్రభుత్వం 30,000 ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కష్టపడి పంట పండించే రైతులకు ఇన్సూరెన్స్ లేకపోవడం అన్యాయం అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >