Posted on 2025-09-15 10:31:00
ప్రజావాణిలో పురుగుల మందు తాగిన వృద్ధుడు
కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కన్న కొడుకు, కోడలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విఠల్ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి ఆయనను తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తన కొడుకు నరేష్ తమని పోషించడం లేదని విఠల్ భార్య వీరవ్వ ఆరోపిస్తోంది. కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తమను చంపుతానని బెదిరిస్తున్నాడని, పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో మాట్లాడిన తమకు న్యాయం జరగడం లేదని వృద్ధురాలు వాపోతోంది.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >