Posted on 2025-09-15 13:07:35
45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1980 -81వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరినీ అలరించింది. సుమారు 45 సంవత్సరాల తర్వాత అందరు చందూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చేరుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఇద్దరు గురువులను ఆత్మీయంగా సన్మానించారు..
చందూర్ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించరాని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రైవేటు ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో రాణించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడం వల్లే అప్పటి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. ఆ కాలంలో విద్యార్థులు గురువుల పట్ల ఎంతో గౌరవం మర్యాదలతో మెదిలే వారిని ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అవి కనుమరుగయ్యాయని అన్నారు. ఏదేమైనప్పటికీ 45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >