Posted on 2025-09-15 15:56:09
ప్రజావాణిలో కలెక్టర్ కు తమ సమస్య విన్నవించిన అర్హులైన గీత కార్మికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ మూడో కల్లు డిపోలో అర్హులైన కార్మికులకు అవకాశం కల్పించకుండా.. స్థానికేతరులకు సభ్యత్వం ఇచ్చారని నగరానికి చెందిన గీత కార్మికుడు సురేష్ గౌడ్ వాపోయారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సంఘంలో ఇతర సంఘాల్లో సభ్యులైన వారికి, టాపింగ్ టెస్టులో పాల్గొనని వారికి, దుబాయ్‌లో ఉన్నవారికి, ఉద్యోగం చేసుకునే వారికి సభ్యత్వం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కనీసం చెట్టు ఎక్కరాని వాళ్లకూ కూడా సభ్యత్వం ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు తాత్కాలికంగా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చి సభ్యత్వం తీసుకున్నారని వాపోయారు. ప్రధానంగా సేపూరు స్వామి గౌడ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వారి సొంత గ్రామంలో సభ్యులుగా ఉన్నారని, అయినా మళ్లీ ఇక్కడ తీసుకోవడం తగదన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నవీన్, భిక్షపతి, ప్రవీణ్, మధు తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >