Posted on 2025-09-17 08:14:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతు కాసిం రాజ్వి లాంటి క్రూర మృగాలు మన తెలంగాణ ఆడబిడ్డల మానాలు దోచుకుని బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన సందర్భంలో ఎదురు తిరిగిన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం దుర్మార్గుడు నిజాం నవాబు అని అన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీగోండ్, దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ,దాశరధి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ ఎందరో మహనీయులు నిజాంకు ఎదురుతిరిగి ప్రాణాలు అర్పించారని అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగోషాను అర్ధం చేసుకున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్ )తో నిజాం మేడలు వంచి, నిజాం కబంద హస్తల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డలకు 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవనికి ప్రతీక అయినా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపకుండా గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ , ఇప్పటి కాంగ్రెస్ తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలన్నారు. నిజాం ఆనవాళ్ళను పూర్తిగా చేరిపివేయాలి అందులో భాగంగా నిజామాబాదును ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డల పేర్లు పెట్టాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రాజు,జిల్లా కార్యదర్శి జోతి గారు,జిల్లా బీజేపీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >