Posted on 2025-09-17 14:43:41
దాస్ నగర్ మాక్లూర్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దాస్ నగర్ మాక్లూర్ రోడ్డుపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్ మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా సమీపంలో బుధవారం ఈఘటన చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. బైక్ చింటూ నడుతున్నాడు. మార్గ మధ్యలో మాక్లూర్ - దాస్ నగర్ రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడటంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. చింటూ, పూజలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజ కూడా మృతి చెందింది. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >