| Daily భారత్
Logo




స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి

News

Posted on 2025-09-17 14:45:11

Share: Share


స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి

33 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రోజులు తన జీవితంలో తీపి గుర్తులు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి బుధవారం సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, 33 సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశానని, ఆ సమయంలో విద్య వ్యవస్థలో, వైద్య రంగంలో, నీటిపారుదల రంగంలో, హార్టికల్చర్ రంగంలో చాలా మార్పులు చేశానని అవి  నాకు ఇంకా తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయన్నారు. విధాత నిర్దేశమొ విధి రాతయో కొంతమంది వైకల్యాన్ని సంతరించుకున్నారని కానీ నేడు శాస్త్రీయ పరంగా, విజ్ఞాన పరంగా సరైన సమయంలో జినోమ్  పరీక్షల ద్వారా, అవయవాల నిర్మాణం, మేదస్సు యొక్క స్థితి తెలుసుకోగలమని గర్భాస్త్రంలో  ఉన్న శిశు ఏదైనా లోపాలతో ఉన్నట్లయితే లోపాలను సరిచేసి ఆరోగ్యకరమైన సాధారణ శిశువును జన్మించడానికి నేడు శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సమాజాన్ని కోరారు. జినోమ్ ఏర్పాటు చేసిన పిసి గాంధీ  తనకు మంచి మిత్రుడని ఈ రంగంలో ఆయన సహాయ సహకారాలు మనం తీసుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.

 వికలాంగుల సంక్షేమం కోసం ఏమైనా అడ్డంకులు ఉంటే  వాటిని అధిగమించడానికి అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో కూడా మాట్లాడి వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక రైతుకు ఒక సైనికుడికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎమ్ఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్ సామ్రాట్, స్నేహ సొసైటీ, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, బి సి టి యు రమణ స్వామి మానసిక వికలాంగులు, అందులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మానసిక వికలాంగులు చేస్తున్న ఒకేషనల్ ప్రొడక్ట్స్ ఒకేషనల్ ఉత్పత్తులు  అయిన ఫినాయిల్ పూసలతో బ్యాగులు వస్తువులను పరిశీలించారు అనంతరం మానసిక వికలాంగులను అభినందించారు. అదేవిధంగా కార్యక్రమంలో రైతు సుధీర్ మహాజన్, సైనికుడు సురేష్ పోలిశెట్టి లను సన్మానించారు జిల్లా సైనిక వెల్ఫేర్ అధ్యక్షుడు సుర హర ప్రసాద్ పాల్గొన్నారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >