| Daily భారత్
Logo




బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదు... చికిత్సతో నయం చేయవచ్చు

News

Posted on 2025-09-18 11:11:11

Share: Share


బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదు... చికిత్సతో నయం చేయవచ్చు

హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం రక్త క్యాన్సర్ దినోత్సవం గా జరుపబడుతుందని, రక్త క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఇట్టి వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. ఇట్టి క్యాన్సర్ అత్యంత ఖరీదైన వైద్యం అభివృద్ధి చెందిన దేశాలలో 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఇక్కడ మాత్రం 20 లక్షల లో ఈ వైద్యం పూర్తవుతుందని తెలిపారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సంప్రదించగా 2014 నుండి 2017 వరకు చికిత్స అందజేయడంతో బాలుడు అత్యంత మెరుగై క్రీడలలో చదువులో రాణిస్తున్నాడని, 13 సంవత్సరాల సోమేశ్వర్ ఇదే వ్యాధితో బాధపడుతుంటే అతనికి కూడా చికిత్స అందజేయడం జరిగిందని దీనితో బాలుడు చలాకీగా ఉన్నాడని, వర్ని మండలానికి చెందిన రామారావు 8 సంవత్సరాల నుండి రక్త క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొని సమాజంలో చలాకీగా పని చేసుకుంటున్నారని వివరించారు. రక్త క్యాన్సర్లు ఒకప్పుడు భయం అనిశ్చితి ని కలిగించాయని కానీ 2025లో ఖచ్చితమైన వైద్యం రోగనిరోధక చికిత్సలు లక్ష్యంగా చేసుకున్న మందులు అధునాత ఎముక మజ్జ బోన్ మారో మార్పిడి కారణంగా అనేక రకాల రక్త క్యాన్సర్లు రక్త రుగ్మతలలో 90% మించిపోయాయని నేడు రోగులు బతికేవారు కాదని వారు పూర్తిగా సాధారణ ఆరోగ్యకరమైన జీవితాలను ఇట్టి చికిత్స ద్వారా గడుపుతున్నారని అన్నారు. భారతదేశంలో ప్రతి 20 సెకండ్లకు ఎవరైనా ఒకరు రక్త క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని అయినప్పటికీ మన దేశంలో అందుబాటులో ఉన్న ఆధునిక సంరక్షణతో నేడు చాలామంది రోగులలో రక్త క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. ఆరోగ్యం డబ్బు లాంటిదని మనం దానిని కోల్పోయే వరకు దాని విలువ గురించి మనకు నిజమైన ఆలోచన ఉండదని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని ప్రతి క్యాన్సర్ కి చికిత్సలు తప్పకుండా చేయబడతాయని చికిత్సలతో నయమవుతాయని తెలిపారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >