| Daily భారత్
Logo




ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమంలో టీ పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్

News

Posted on 2025-09-19 13:27:06

Share: Share


ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమంలో టీ పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్

దేశ నిర్మాణం లో గురువుల పాత్ర ఎంతో గొప్ప స్థానం

చదువు లేనిది భవిష్యత్ లేదు..

తన విద్యాబ్యాసం లో గురువులు కొట్టిన దెబ్బలు ఇప్పటికి గురున్నాయి..

విద్య అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తాం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేశ , రాష్ట్ర నిర్మాణంలో గురువుల పాత్ర ఎనలెనిదని, చదువు లేనిది భవిష్యత్ లేదని టిపిసిసి అద్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి గోజూరి అరుణ్ , కోశాధికారి ఉప్పాల మధు, స్టేట్ అడ్వజర్, ప్రోగ్రాం కన్వీనర్ మామిడాల మోహన్ ఆధ్వర్యంలో ట్రస్మా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు కార్యక్రమం రూరల్ నియోజక వర్గంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 

బెస్ట్ టీచర్స్ అవార్డు 2025  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి పి సి సి అద్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజ రెడ్డి, ఆర్మూర్ ఇంచార్జీ వినయ్ రెడ్డి, పి సి సి డెలిగేట్ నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం భూపాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, 

యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర కోశాధి కారి జయసింహ గౌడ్  విచ్చేశారు. ముందుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా.. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించి విజయం సాధించారన్నారు.  

గురువుల పాత్ర గొప్పదని, ఆనాడు గురువులు చూపిన బాటలో నడిచినందుకు, క్రమశిక్షణను అలవర్చుకున్నందుకు ఈనాడు ఇంతటి స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గురువులంటే భయం భక్తి ఉండేదన్నారు. విద్యార్థుల భావి తరాలకు తీర్చి దిద్దేది  గురువులని,  దేశం పటిష్టంగా తయారు అవ్వాలంటే, అభివృద్ది చెందాలంటే గురువుల పాత్ర ఎనలేనిదని అన్నారు. చదువుతోపాటు 

మన సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు చదువంటే మార్కులు,  ర్యాంక్ లు అనుకుంటున్నారని, విద్యార్థులకు స్కిల్స్ నేర్పితే భవిష్యత్తులో రాణించగలుగుతారన్నారు. వారికి నచ్చిన రంగంలో వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు.విద్యార్థుల పై చెడు ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని గుర్తు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కృషి చేస్తామన్నారు. 

వ్యవసాయ కళాశాల మంజూరు అయిందని త్వరలోనే ప్రారంభం కానుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అభివృద్ది లో ప్రభుత్వం పాఠశా లాలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు పాత్ర ఎంతో ఉందని అన్నారు. అవార్డు బాధ్యతను మరింత పెంచుతుందని నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 

 రానున్న మూడేళ్లలో విద్య పరంగా అభివృద్ది పథంలో నడిపిస్తామని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల కు చేడు అలవాట్లకు లోనూ కాకుండా తల్లి దండ్రుల కంటే ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుందని అన్నారు. నాణ్యమైన విద్య అందించే అన్ని స్కూల్ లకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ప్రైవేట్ పాఠశాలలు చొరవ చూపాలి అన్నారు.


Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >