Posted on 2025-09-19 14:12:30
డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల యందు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ ఇచ్చే ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ G. వనజా కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ విచ్చేయడం జరిగింది.DIEO మాట్లాడుతూ విద్యార్థినులు ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కష్టపడి చదువాలని అన్నారు. ఈ కళాశాల విద్యార్థినులు మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి లో ర్యాంక్ లు తీసుకురావడం జరిగిందని వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొని రావాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ...
ప్రపంచంలో చదువుకు మించిన సంపద ఏది లేదని ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ, సీతారాము, k. సునీత, ఆఫ్రోజ్ సుల్తానా,శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, జబిఉల్లా,M. సునీత, గంగరాజు, కృష్ణవేణి , ఆఫీస్ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >