| Daily భారత్
Logo




దేవిమాత మండపాలలో ప్రతిష్టింపచేసే దుర్గాదేవి అమ్మవారికి పట్టుచీరాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-09-20 10:26:05

Share: Share


దేవిమాత మండపాలలో ప్రతిష్టింపచేసే దుర్గాదేవి అమ్మవారికి పట్టుచీరాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ లోగల డి.ఎస్.ఎన్  కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే, ట్రస్ట్ చైర్మన్  ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దేవి నవరాత్రుల సందర్బంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించిన సందర్బంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందని అన్నారు. హిందూ  ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు,అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ధన్ పాల్ లక్ష్మీబాయి & విఠల్ గుప్త ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు  తదితరులు పాల్గొన్నారు.


Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >