| Daily భారత్
Logo




స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయండి... బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

News

Posted on 2025-09-27 16:46:23

Share: Share


స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయండి... బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు జీవో విడుదల చేసి, ముందుకు పోతామంటే ఎలా?.. అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపు లాయర్లపై ప్రశ్నలు సంధించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదని, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉందని కూడా స్పష్టం చేసింది.  రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలు వేసింది.

దసరా సెలవుల తర్వాత దీనిపై తమ వాదనలు వినాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారు. దీంతో పూర్తిగా  మీరు చెప్పినప్పుడు వింటామని జడ్జి చెప్పారు.  దీనిపై తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న అడ్వకేట్ జనరల్ కోర్టు వారికి చెప్పారు.

ఈ క్రమంలో.. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో నోటిఫికేషన్ కు తాము  సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. ఏ  క్షణంలోనైనా  నోటిఫికేషన్ ఇస్తామని కోర్టుకు తెలిపింది.  మరోవైపు.. నోటిఫికేషన్ వచ్చినా, ఈ పిటిషన్లను మెరిట్ ఆధారంగా విచారిస్తామని హై కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇరువైపుల వాదనలువిన్న హైకోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >