Posted on 2025-09-28 15:41:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు ఆదివారం డిచ్పల్లి మండలం సాంపల్లి తాండాలోని జగదంబ మాత, సేవాలాల్ మహారాజ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో సాంపల్లి తండావాసులు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే జగదంబ మాతకు ముక్కుపుడక, ఒడిబియ్యం సమర్పిస్తామని మొక్కుకోగా, ఆ మొక్కును ఎమ్మెల్యే దంపతులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ సాంపల్లి తండాకు కావాల్సిన నిధులు కేటాయిస్తానని, ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పాఠశాల ప్రహరీగోడ, మహిళా సంఘాల భవనం, అంగన్వాడి భవనం నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు.
మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, పంట రుణ మాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. మంచి పని రిజర్వాయర్ పాత డిజైన్ ప్రకారమే జీవో త్వరలో వస్తుందని తెలిపారు. బిజెపి, బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శిస్తూ, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42%, ఎస్టీలకు 10%, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి వినోదిని రెడ్డి, మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు కంచెటి గంగాధర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >