| Daily భారత్
Logo




బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మహిళా పోలీసులు, సిబ్బంది

News

Posted on 2025-09-28 18:01:53

Share: Share


బతుకమ్మ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మహిళా పోలీసులు, సిబ్బంది

పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సాంస్కృతి

కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జిల్లా పోలీసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలోని స్థానిక విజయలక్ష్మి  గార్డెన్ హాల్ లో ఆదివారం నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్  పోలీసు సిబ్బంది  , పోలీస్ కార్యాలయం సిబ్బంది , రేంజ్ కార్యాలయం సిబ్బంది , హోమ్ గార్డ్స్ సిబ్బంది, అలైడ్ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలను జిల్లా కలెక్టర్  వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులతో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని మరియు తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని అని  అన్నారు. జిల్లా ప్రజలకు బతుకమ్మ , విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ,  ఐక్యత,  సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , అదనపు డిసిపి (ఏఆర్)  రామచంద్రరావు , నిజామాబాద్ , ఆర్మూర్,  బోధన్ ఏసిపి లు  రాజా వెంకటరెడ్డి , శ్రీనివాస్ , వెంకటేశ్వర్ రెడ్డి , సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >