| Daily భారత్
Logo




డా. చిటికెనకు డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కార ప్రధానం

News

Posted on 2025-09-29 05:23:18

Share: Share


డా. చిటికెనకు డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కార ప్రధానం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల పట్టణానికి చెందిన పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్‌కి డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారం ప్రధానం చేశారు.

తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలు అందిస్తూ కవిగా, కథారచయితగా, విమర్శకుడిగా, సంపాదకీయకర్తగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన  డా. చిటికెన కిరణ్ కుమార్‌ వంద పైచిలుకు పత్రికల్లో కథలు, కవితలు, వ్యాసాలు అనేకంగా రచించారు.ఈ సాహిత్య సేవలను గుర్తించి అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం అఫ్జల్ గంజ్ హైదరాబాదులో కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ అధ్యక్షులు డా. రియాజ్ అలీ, పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరి కాశీనాథ్, అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, బైరి శ్రీనివాస్ లు శాలువా, మెమెంటో, వస్త్ర కిరీటం పూలమాల, ప్రశంసా పత్రాలతో డా. చిటికెన కిరణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ అవార్డు, వేలాది లలితగీతాలను రచించిన జాతీయ కవి, మహాకవి, సినీ గేయరచయితగా ఖ్యాతి పొందిన స్వర్గీయ డా. వడ్డేపల్లి కృష్ణ గారి స్మారకార్థంగా ప్రారంభించబడింది. తెలుగు సాహిత్యం, సినీ రంగం, సంగీతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అతిథులు గుర్తు చేశారు.

ఈ సందర్భంగా  అవార్డును స్థాపించిన అఖిలభారత పద్మశాలి సంక్షేమ సంఘ  ప్రధాన కార్యదర్శి సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్‌ సాహిత్య ప్రయాణం కొత్త తరాలకు ప్రేరణనిస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో  స్కూల్ ఎడ్యుకేషన్ పూర్వ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీ దేవి, ప్రముఖ కవయిత్రి డా. రాధాకుసుమ, తుమ్మ జనార్ధన్, సత్యవీణ మొండ్రేటి తదితరులు కవులు, రచయితలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.

Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >