| Daily భారత్
Logo




జీవన శైలిలో మార్పు వచ్చినప్పుడే గుండె నొప్పిని అదిగమించవచ్చు

News

Posted on 2025-09-29 07:23:12

Share: Share


జీవన శైలిలో మార్పు వచ్చినప్పుడే గుండె నొప్పిని అదిగమించవచ్చు

మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ హార్ట్ డే దినోత్సవం సందర్భంగా వాకేథన్ కార్యక్రమంలో అదనపు అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ కమిషనర్ బసవ రెడ్డి

 డైలీ భారత్, నిజామాబాద్: మానవ జీవన శైలిలో ఆహారపు, చెడు అలవాటులకు దూరంగా ఉన్నప్పుడే గుండె నొప్పితో బాధపడే కేసులను అధిగమించవచ్చని అదనపు  డిప్యూటీ ( అడ్మిన్ )కమిషనర్ బసవ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో కలిసి 2kవాకేథన్ కార్యక్రమాన్ని వినాయక నగర్ లోని రుక్మిణి చాంబర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిసిపి బసవ రెడ్డి  ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డిసిపిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గుండె నొప్పి సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయని దీనికి కారణం వారి ఆహార అలవాట్లు, స్మోకింగ్, వ్యాయామం చేయకపోవడం వల్లనే గుండె కు అధిక భారం పడి ఎక్కువమంది గుండె నొప్పితో మృతి చెందుతున్నారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల సదానంద రెడ్డి మాట్లాడుతూ...

నేటి యువత దేశ మార్గం నిర్దేశకులైన వారు సైతం కూడా ఈ గుండె నొప్పి బాధతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ప్రశాంతంగా రోజులు ఒక గంట సమయం ప్రశాంత వాతావరణంలో వ్యాయామం చేస్తే గుండె నొప్పి సమస్యల నుండి దూరం కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నేటి తరం యువత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్లే ముఖ్యంగా యువత గుండె నొప్పి బారీన పడుతున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో  కార్డియాలజిస్ట్ సందీప్ రెడ్డి, రవి కిరణ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >