| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

News

Posted on 2025-09-29 07:44:36

Share: Share


రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హరిత

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా 2013 బ్యాచ్‌కి చెందిన ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె సోమవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆమె స్థానంలో పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝా రోడ్లు, ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ డిపార్ట్మెంట్‌కి స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అయితే ఎం.హరిత అంతకుముందు విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ, సహకార శాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్‌గా పని చేశారు. 2022లో విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా, వరంగల్ రూరల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >