| Daily భారత్
Logo




గుండెను కాపాడుకుందాం.. హాయిగా ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం

News

Posted on 2025-09-29 19:09:07

Share: Share


గుండెను కాపాడుకుందాం.. హాయిగా ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం

సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గుండెను కాపాడుకుందాం హాయిగా జీవిద్దాం అని,డోంట్ స్కిప్ హార్ట్ బిట్ నినాదంతో ముందుకు వెళ్దాం అంటూ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం హార్ట్ డే ను పురస్కరించుకొని సిగ్మా ఆస్పత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ న హార్ట్ డే ను నిర్వహించి ప్రజలకు ఒక మెసేజ్ ను ఇస్తారని ఈ సంవత్సరం డోంట్ స్కిప్ హార్ట్ బీట్ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కలుపుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం రోజురోజుకు పెరాలసిస్, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనలలో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితేగత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే 25 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో గుండె జబ్బులు పెరిగి సడెన్ హార్ట్ ఎటాక్ లకు గురవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటివి మానుకోవాలి. మాంసకృతులను అధిక మొత్తంలో తీసుకోకూడదు.

గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాకు అయినప్పుడు ఆక్సిజన్ అందక పనితీరు మందగిస్తుంది. అప్పుడు గుండె ఒత్తిడికి గురై నొప్పి వస్తుంది. దీన్ని హార్ట్ ఎటాక్ అంటాం. ముందుగా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దాని లక్షణాలు సాధారణంగా చాతి మధ్య భాగంలో నొప్పి రావడం, మంట, చెమటలు పట్టడం భుజం నుంచి చెయ్యి వరకు నొప్పి వాపు వస్తుండడం ఉంటే వెంటనే గుండెపోటుగా అనుమానించి డాక్టర్ను సంప్రదించాలి అని తెలియజేశారు. కనీసం మూడు నెలలకు ఒకసారి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడటం సులువవుతుంది అని తెలియజేశారు.

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >