| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

News

Posted on 2025-12-06 10:46:40

Share: Share


కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు.

దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారన్నారు. విద్య, న్యాయం, సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడారన్నారు. అంబేడ్కర్  ప్రజలకు స్వేచ,స్వాతంత్రపు హక్కులు కల్పించారని, కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుందన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలరస్తుందన్నారు. అంబేడ్కర్ పేరును కనుమరుగు చేసే విధంగా బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కారక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని,రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,సీనియర్ నాయకులు భక్తవత్సలం,సీనియర్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ  ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, ఏఐసిసి అసెంబ్లీ కో ఆర్డినేటర్ కాపుకర్ గన్ రాజ్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష,చంద్రకళ, విజయ రాణి,దత్తాద్రి,బంటు బలరాం,రాజేంద్ర ప్రసాద్, ఆమ రాజు, అయ్యుబ్,భాజన్న, మహేందర్,ఎండల కిషన్, నరేందర్ గౌడ్, కరాటే రమేష్, అఫ్సర్, చికోటీ దిలీప్, శిలమంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 11:44:44

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య

Posted On 2026-04-10 11:41:43

Readmore >
Image 1

ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-10 09:22:18

Readmore >
Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >