| Daily భారత్
Logo




సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-12-23 19:40:15

Share: Share


సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ మైసాని లావణ్య హరితో పాటు వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్  శ్రీదివ్య మురళీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

నూతన సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >