Posted on 2026-01-01 18:41:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రే కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సురాబత్తుని శ్రీనివాసరావు జిల్లా చైర్మన్ ఐ క్యాంప్స్, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని రాబోయే కాలంలో కూడా స్నేహ సొసైటీ ప్రారంభించబోతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సేవా కార్యక్రమాలను చేపట్టి పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సేవలను అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహసొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వయోజన దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని పునః ప్రారంభిస్తుందని, చారిటీ కంటి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు టి. వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కే పోశెట్టి, కోశాధికారి కే సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కే లక్ష్మణ్, స్నేహ సొసైటీ దివ్యంగా బాలలు సిబ్బంది, స్నేహ సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >