| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన అటవీ శాఖ అధికారి

News

Posted on 2026-01-03 20:54:22

Share: Share


ఏసీబీ కి చిక్కిన అటవీ శాఖ అధికారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3.51 లక్షల లంచం తీసుకుంటుండగా.. అటవీ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాలు  డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొత్తగూడెం అటవీ సబ్-డివిజన్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాల కృష్ణను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి సుమారు 3,900 టున్నల నీలగిరి చెట్లను నరికివేయడానికి కావాల్సిన బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం కొత్తగూడెం ఫారెస్ట్​ డివిజనల్​ మేనేజర్​ తాటి శ్రావణి రూ. 3.51 లక్షల లంచం డిమాండ్​ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి శనివారం రూ.3.51 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, ప్రైవేట్ వ్యక్తి గోపాల కృష్ణ సూచనల మేరకు జోగు చెన్నారావు అనే వ్యక్తి లంచం మొత్తం రూ. 3,51,000 తీసుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు ఈ కేసులో రాజేందర్, గోపాల కృష్ణను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు తాటి శ్రావణి పరారీలో ఉన్నారు. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.

Image 1

అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

Posted On 2026-05-06 15:50:08

Readmore >
Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >