Posted on 2026-01-05 16:24:56
కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ తోపాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ డిమాండ్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వెల్మల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ శివారులో నాలుగు ఎకరాల 100 గజాల స్థలం ఉందని, అందులో పిఎసిఎస్ లో తమ గ్రామం నుండి 13 వరకు సభ్యత్వం ఉందని ఆయన అన్నారు. అయితే రెండు సీజన్లకు కలిపి ఒక లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని తమ గ్రామా రైతులు పండిస్తారని ఆయన తెలిపారు. అయితే తమకు చెందిన నూతన సొసైటీని నందిపేట్ లో ఏర్పాటు చేసి వెల్మల్ గ్రామాన్ని అందులో కలిపే కుట్రలు జరుగుతున్నాయని తమ గ్రామస్తుల దృష్టికి వచ్చిందన్నారు. నందిపేట్ లో తమకు చెందిన సొసైటీ ఏర్పాటుకు తాము ఎలాంటి వ్యతిరేకము కాదని కానీ మమ్మల్ని అందులో విలీనం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రెవిన్యూ పరంగా జిల్లాలోనే ధాన్యం పండించడంలో రెండవ స్థానంలో తమ గ్రామం ఉందని ఆయన అన్నారు. కావున జిల్లా అధికారులు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తమ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ ఏర్పాటు చేయాలని గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. లేనియెడల రాబోయే ఎన్నికలను వెల్మల్ గ్రామ ప్రజలు పూర్తిగా బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కావున తమ గ్రామానికి ప్రత్యేకంగా పిఎసిఎస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇస్సపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల గంగారం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, జి ఆర్ రాజేందర్, మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >