| Daily భారత్
Logo




తప్పుల తడకగా ఉన్న మున్సిపల్ ఓటర్ జాబితాను సరిదిద్దాలి

News

Posted on 2026-01-05 16:25:47

Share: Share


తప్పుల తడకగా ఉన్న మున్సిపల్ ఓటర్ జాబితాను సరిదిద్దాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తప్పుల తడకగా ఏర్పాటుచేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ జాబితాను సరిదిద్దాలని టిడిపి మాజీ పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో అవకతవకలు పెద్ద మొత్తంలో జరిగాయని దాన్ని వెంటనే సరిదిద్దాలని, కొన్ని చోట్ల అయితే మున్సిపల్ డివిజన్లు వార్డుల వారీగా గల్లంతయాయని ఆయన అన్నారు. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటర్ లిస్టులో ఒక డివిజన్లో ఉన్న ఓటర్ను సంబంధం లేకుండా మరో డివిజన్లోకి ఎలా ఏ విధంగా కలిపారు అంటూ ఆయన ప్రశ్నించారు. తారుమారైన ఓటర్ జాబితా ను సరిచేయాలని దీనికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా ఇలా ఓటర్ జాబితాలో అవకతవకలు తిరగడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఓటర్ జాబితా పూర్తిగా సరిదిద్దాకేనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోకి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు సి రాజు, బీసీ సెల్ నాయకులు రవికుమార్ పాటిల్, నాయకులు బాలాజీ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >