| Daily భారత్
Logo




ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి

News

Posted on 2026-01-05 16:50:59

Share: Share


ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి

ఆకస్మిక పర్యటనలు చేయడం తన అలవాటు.

జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..

స్పష్టం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి, పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం ప్రగతిని పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని అవలంభిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కాకూడదని, కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో వినతులు, ఫిర్యాదులు అందిస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ పరిష్కరించేందుకు అనువుగా ఉన్న వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందనే విషయాలను తెలుసుకునేందుకు, శాఖా పరమైన అంశాలను గమనించేందుకు  ప్రజావాణి కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని, ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.  కాగా, మండల ప్రత్యేక అధికారులు జిల్లా ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేయడం తనకు అలవాటాన్ని ఆమె అన్నారు. ఆయా కార్యక్రమాలు, పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి శాఖ పనితీరు సమర్ధవంతంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున, సంబంధిత అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఫాం-6, ఫాం-7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు ఫిర్యాదులు స్వికరించగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు కలెక్టర్ ను ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించారు.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >