Posted on 2026-01-06 18:36:08
పీజీ మెడికో లతో వంతుల వారిగా వైద్యం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో ఎంబిబిఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించి ఓపి వైద్య సేవలను అందించడానికి వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వ, రిటైర్డ్, పాత్రికేయుల కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ లో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిస్థాయి డాక్టర్లు లేకపోవడంతో చేసేదేమీ లేక వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ అధికారిని పీజీ చదివే మెడికల్ విద్యార్థులతో వంతుల వారీగా రోజుకో మెడికల్ పీజీ స్టూడెంట్ ను రప్పించి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు కేవలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి ముగ్గురు ఎంబిబిఎస్ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క ఎంబిబిఎస్ వైద్యుడు కూడా సదరు వెల్నెస్ సెంటర్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. అందులో ఇదివరకు విధులు నిర్వహించిన ఎంబిబిఎస్ డాక్టర్లు రాజీనామా చేసి వేరే చోటికి వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మధ్యాహ్నం నుండి వైద్యం చూపించడానికి వచ్చే రోగులకు వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి కాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అందులో పని చేసే ఉద్యోగులు సైతం ఫోన్లో కాలక్షేపాలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే డాక్టర్ను నియమించాలని రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు కోరుతున్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >