| Daily భారత్
Logo




తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం

News

Posted on 2026-01-06 19:03:49

Share: Share


తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం

యువత రక్త దానానికి ముందుకు రావాలి

సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి

డైలీ భారత్, కామారెడ్డి: వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి గారు ఆవిష్కరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ యువత రక్త దానానికి ముందుకు రావాలని తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని దానికోసం నిర్వహిస్తున్న ఈ శిబిరానికి ఎక్కువ సంఖ్యలో రక్తదాతలు రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అన్నారు.ఇప్పటికీ రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని రక్త దానం చేసే వారికి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వివిధ సర్వేలు తెలియజేశాయని ఈ విషయాన్ని అవగాహన చేసుకుని రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వంచ చంద్రసేన్ రెడ్డి,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,జూనియర్ అసిస్టెంట్ సమీవుల్లా ఖాన్ లు పాల్గొనడం జరిగింది.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >