Posted on 2026-01-06 19:07:16
సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చాలన్ విధింపు
నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ సందర్శించి, సిబ్బంది ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఏ విధంగా ఈ-చాలన్లు విధిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి, ఈ-చాలన్ల ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.
సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలోనే కాకుండా నిందితుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా, నంబర్ ట్యాంపరింగ్ చేసిన లేదా నంబర్ తుడిపివేసిన వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వాహనాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు, మరణాలు మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, గౌరవ ఉన్నత న్యాయస్థానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి NH-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం – కామారెడ్డి జిల్లా పరిధిలో) వేగ పరిమితిని 80 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపితే తప్పనిసరిగా జరిమానాలు విధించబడతాయని స్పష్టం చేశారు
ఇకపై ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, వేగ పరిమితిని మించకుండా ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఇలా చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమవుతామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >