| Daily భారత్
Logo




దుర్గామాత అమ్మవారి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2025-09-29 19:14:28

Share: Share


దుర్గామాత అమ్మవారి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అమ్మలగన్నా అమ్మ ఆది పరాశక్తి జగన్మాత మనుషులలోని దుర్గుణాలను పారద్రోలి సద్గుణాలను ప్రసాదించే అందరి కల్పవల్లి అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పతంజలి యోగ సెంటర్లో నిర్వహింపబడుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్న సాయం సంధ్యా వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పురోహితుల తీర్థప్రసాదాలతో పాటు ఆశీర్వచనాలు అందుకున్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి కండువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అయిన అమ్మవారు అందరి కోరికలు ఈడేర్చి నెరవేర్చే అందరి కల్పవల్లి  నియమ నిష్ఠలతో శ్రద్ధాసక్తులతో పూజిస్తే కోరిన వరాలను ఇస్తుందని, శక్తికి ప్రతీక అయిన అమ్మవారు తన అమూల్యమైన శక్తితో మనిషిలోని దుర్ఘుణాలను పారద్రోలి సద్గుణాలను ప్రసాదిస్తుందని, మనిషి లోపల సద్గుణాలు ఉన్నప్పుడే ఉన్నత వంతుడు అవుతాడని, అమ్మవారి దయవలన అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తీరోక్క పూలతో గౌరమ్మ దేవికి మొక్కులు సమర్పించి  పూలను పేర్చి అమ్మవారిని ఆరాధించే పూల పండుగ మన బతుకమ్మ పండుగ అని  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పతంజలి యోగ సెంటర్లో బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొని  మహిళా మణులు అందరితో కలిసి బతుకమ్మ ఆడి అందరిని ఉత్సాహపరచగా, ఎమ్మెల్యే బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని తమతోపాటే బతుకమ్మ ఆడినందుకు కాలనీ మహిళలందరూ హర్షతిరేకంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని అడుగులు వేయగానే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు అగ్గునూరి బస్వం, మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, సర్వర్ పాషా, ముబారక్ అలీ ఖాన్, బాలగంగాధర్ తిలక్ లతోపాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో కాలనీ మహిళలు, అమ్మవారి భక్త మహాశయులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >