| Daily భారత్
Logo




తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు

News

Posted on 2025-09-30 03:42:49

Share: Share


తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు

డైలీ భారత్, హైదరాబాద్‌: తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాయి. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేల మందితో బతుకమ్మ వేడుకను అధికారులు చేపట్టారు. మహా బతుకమ్మ దగ్గర గిన్నిస్‌ బుక్‌ రికార్డు సభ్యుల పర్యవేక్షణ చేశారు. ఈ నేపథ్యంలో మహా బతుకమ్మ కార్యక్రమం ఏకంగా రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించింది. మరో రికార్డుగా 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్‌ రికార్డు క్రియేట్ చేశారు.

ఈ మేరకు తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటించారు. ఒకేసారి పది వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా మహా బతుకమ్మ కార్యక్రమం కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు అధికారుల అంచనాలను మించి మహా బత్తుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది..

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >