| Daily భారత్
Logo




భగవాన్ దాస్ కాలనీ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

News

Posted on 2025-09-30 13:41:31

Share: Share


భగవాన్ దాస్ కాలనీ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

సద్దుల బతుకమ్మకు భారీ ఎత్తున హాజరైన మహిళలు... 

డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / భద్రాచలం: భద్రాచలంలో భగవాన్ దాస్ కాలనీ లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారు సరస్వతి అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 1200 మందికి పైగా భక్తులు అన్నదానం లో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మహిళలు కూడళ్లకు తీసుకువచ్చి గుంపులుగా చేరి పాటలతో, ఆటలతో హోరెత్తించారు. ,ఆడపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను జాతర వాతావరణంలో కొనసాగించారు.  ప్రతి ఇంటి మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన బతుకమ్మలను రంగుల పూలతో అలంకరించి తీసుకువచ్చారు. పూల సువాసన, పాటల రాగాలు, చప్పట్ల శబ్దాలతో ప్రాంతమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. మహిళలు ఒకే తీరులో వలయంగా కూర్చుని ఆటలాడటం, పాటలు పాడటం చూసి చిన్నారులు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు.  సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానికులు భారీ ఎత్తున పాల్గొని ఒకరితో ఒకరు శుభాకాంక్షలు పంచుకున్నారు. అంతా పూల వర్ణాలతో మెరిసిపోతూ సద్దుల బతుకమ్మ జాతర ఘనంగా ముగిసింది. 


ఈ కార్యక్రమంలో  కుంజా ధర్మా, భూక్యా రంగా, ముగడ హరినాథ్, ఎస్కే సిరాజ్, ఆడబాల వెంకటేశ్వర్లు, ప్రియ, సున్నం భూలక్ష్మి, తెల్లం సునీత, కే రామకృష్ణ, శ్రీదేవి, పి రాంబాబు, జ్యోతి, అరుణ, కే శ్రీను, నిర్మల, రామకృష్ణ, వీరమణి,నాగేశ్వర రావు, సుదర్శన్, రామాచారి, స్వరూప, సుశీల, లీలావతి, సాయి, ప్రియాంక, రమణమ్మ, క్రిష్ణ ప్రియ,ఉష, వాణి, రమణ, కమల, యశోద, మీనా, గణేష్, బి  రాజేశ్వరి, సమ్మక్క సారక్క దేవుడమ్మ, మహేష్, సంతోష్,హరికృష్ణ, గోపాల కృష్ణ, లత, రమ్య, జయ, మని, భక్తులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >