| Daily భారత్
Logo




వివాదాలకు కేంద్ర బిందువుగా నిజామాబాద్ సెంట్రల్ జైలు..

News

Posted on 2025-10-01 07:28:02

Share: Share


వివాదాలకు కేంద్ర బిందువుగా నిజామాబాద్ సెంట్రల్ జైలు..

జైల్లో కూడా వీఐపీలకు ఓ ట్రీట్మెంట్.. సాధారణ ప్రజలకు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన..

ఇటీవల బదిలీ అయిన ఓ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణ..

 జైలు అధికారుల అమానుష దాడిలో జివిత ఖైదికి తీవ్రగాయాలు

విచారణకు అదేశించిన జిల్లా న్యాయమూర్తి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు అధికారుల చుట్టు వివాధాలు  మూసురుతున్నాయి. జిల్లా జైలులో పనిచేసి ఇటివల బదిలీ ఐనా అదికారిపై లైంగీక వేదింపుల ఆరోపణల వ్యవహరం ఆలస్యంగా వెలుగు చూసింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగిని వెదించినట్లు  ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు అవివాధం సద్ధు మణిగిందని సధరు మహిళ ఉద్యోగి లిఖీతపూర్వకంగా తనపై ఎలాంటి వేదింపులు జరుగలేదని లేఖ రాసిచ్చిందని అధికారులు ప్రకటన విడుధల చేయడం గమనార్హం. అయితే చట్టం ఎవరికీ చుట్టం కాదు జైలు శిక్ష అనుభవించిన వారి ఎవరైనా విఐపి లైన సాధారణ ప్రజలైన అందరికీ ఒకే రకంగా  జైలు అధికారుల ముఖ్య విధి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వారిలో సత్ప్రవర్తన రావడం కోసం  వివిధ రకాలుగా జలువివిధ రకాలుగా జైలు శాఖ అధికారులు వారిలో మార్పు తీసుకు వస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ సెంట్రల్ జైల్ లోని పనిచేస్తున్న అధికారుల తీరుపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారుల వేదింపులు జరుగకపోతే జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మహిళ ఉద్యోగి చేత లీఖిత పూర్వకంగా లేఖ రాసిచ్చరాని చెప్పడం గమనార్హం. అది నిజామాబాద్ జైలులో జరుగలేదని అదికారి బదిలీ అయ్యారని అధికారులు చేతులు దులిపేసుకున్నారు..

ఇటివల ఒక వ్యక్తి జిల్లా సెంట్రల్ జైలులో కోందరికి విఐపి ట్రిట్ మెంట్ ఇస్తున్నారని జిల్లా జడ్జీకి లిఖీత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు తెలిసింది. స్థానికంగా జైలు దగ్గర లోని ఓ గ్రామానికి చెందిన కోందరు మద్యవర్తులుగా వ్యవహరిస్తు ఖైదిల సంబంధికులు రిమాండ్ ఖైదిల బందువుల వద్ధ వసూళ్లు చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వారి ద్వార కాసులు వస్తుండటంతో అధికారులు సంబంధిత వ్యక్తులకు కారాగారంలో విఐపి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒ అధికారి మహిళ ఖైదిల పట్ల అనుచితంగా ప్రవరర్తిస్తున్నారని పిర్యాదులో పెర్కోనడం గమనార్హం. ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి తన పేరు కాకుండా మారు పేరుతో పలనా గ్రామావాసిగా పిర్యాదు చేయడం  విశేషం. ఈ విషయంలో విచారణ జరుపాలని జిల్లా జడ్జీ ఇటివల సినియర్ సివిల్ జడ్జీ( జిల్లా న్యాయసేవాధికార సంస్థ) కార్యదర్శికి అదేశించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. దసరా సెలవులు కావడంతో విచారణ అలస్యం అవుతున్నట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా సెప్టెంబర్ మొదటి వారంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన జీవిత ఖైదిపై ఓ అధికారి అమానుషంగా దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి చేయి విరిగింది. దానితో ఖైదికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తు బాధిత కుటుంబ సభ్యులకు అధికారులకు సమాచారం అందించారు జైలు అధికారులు. జైలుకు వచ్చిన జీవిత ఖైది కి సంబంధించిన సోధరుడు అధికారులను నిలదియడంతో కాళ్లు పట్టుకుంటామని ఈ విషయం పెద్ధది చేయవద్ధని బ్రతిమాలినట్లు తెలిసింది. అధికారులు సస్పెండ్ చేస్తారని బతిమాలుకుని ట్రిట్ మెంట్ చేయిస్తామని పరస్పర ఒప్పంధంతో వివాధంను సద్ధుమణిపించడం వెనక ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలి. జిల్లా సెంట్రల్ జైలు చూట్టు వివాదాలు జరుగడం వెనుక కోందరు అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు  వినిపిస్తున్నాయి. ఇటివల కాలంలో పదోన్నతుల వ్యవహరం జరుగుతుండటంతో కోందరిపై ఆరోపణలు దెబ్బతిసేందుకు వివాదాలను రెపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా జైలు కాస్తా సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ తరువాత సంస్కరణలతో ప్రఖ్యాతి గాంచుతున్న తరుణంలో వివాదాలు ముసరడంతో దానిపై జైళ్ల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >