Posted on 2025-10-01 07:32:33
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్‌గా ఖరారైంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ టికెట్ కేటాయింపుపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు చురుగ్గా సాగుతున్నాయి.గతంలో దమ్మపేట అభివృద్ధి కోసం యాదవ సమాజానికి చెందిన నాయకులు, యువకులు చేసిన కృషిని గుర్తుచేస్తూ, ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ యాదవ సమాజానికి కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. యాదవులకు బలమైన ఓటు బ్యాంకు ఉండటమే కాక, పలు ఎన్నికల్లో పార్టీ గెలుపు దిశగా వారు కీలక పాత్ర పోషించారని స్థానిక నేతలు చెబుతున్నారు.సమాజ అభ్యున్నతి, అభివృద్ధి పనుల్లో ముందుండే యాదవ మహిళకు అవకాశం ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ కేటాయింపులో సమాజాల మధ్య సమతుల్యతను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దమ్మపేటలో యాదవ సమాజాన్ని పట్టించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను అశ్వారావుపేట శాసనసభ్యులు, విద్యావంతులు జారే ఆదినారాయణ ను స్థానిక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి తాళ్ళ శంకరరావు యాదవ్ కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >