| Daily భారత్
Logo




ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థనుతీర్చిదిద్దుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

News

Posted on 2025-12-23 19:34:52

Share: Share


ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థనుతీర్చిదిద్దుతున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

గ్రీన్ ఎనర్జీ రంగం వైపు సింగరేణి విస్తరణకు చర్యలు

ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ వైపు దృష్టి సారించాలి

డైలీ భారత్ న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి కాలరీస్ కంపెనీ నూతన జి.ఎం. కార్యాలయ భవనాన్ని సింగరేణి సంస్థ సి.ఎం.డి. కృష్ణ భాస్కర్, ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ  137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికుల మధ్య జరుపుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ నూతన జీఎం కార్యాలయం విశాలంగా నిర్మించుకొని నేడు ప్రారంభించామని అన్నారు. సింగరేణి సంస్థ నేడు 45 వేల శాశ్వత ఉద్యోగులు, 40 వేల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిందని అన్నారు.  థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు సింగరేణి సంస్థ కృషి చేస్తున్నదని అన్నారు. ‌తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేంద్రాలు బొగ్గు వాడుకోవడం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మనం సరఫరా చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తికే కాకుండా వ్యాపార అవసరాలకు కూడా మనం బొగ్గును సరఫరా చేస్తున్నామని అన్నారు.  బొగ్గు ఉత్పత్తి కంపెనీలు గతంలో ప్రభుత్వ పరంగానే ఉండేవని, కాలక్రమేణ వచ్చిన మార్పులతో  ప్రైవేట్ సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. బొగ్గు మైన్స్ ఆక్షన్ లో ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటున్నాయని, విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున పెరిగిన పోటీలో సింగరేణి కాలరీస్ కూడా తట్టుకొని నిలబడాలని అన్నారు. నాణ్యమైన బొగ్గును మార్కెట్ ధరకు సరఫరా చేయాలని, పోటీని తట్టుకునేలా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి నాణ్యత పెంచుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సింగరేణి సంస్థకు మైనింగ్ లో ఉన్న ప్రావీణ్యం మరెవరికి ఉండదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు తవ్వకాల్లకే పరిమితం కాకుండా సింగరేణి సంస్థ  మరిన్ని రంగాలలో రాణించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తున్నాయని అన్నారు.ప్రపంచీకరణలో వస్తున్న మార్పులను సింగరేణి కాలరీస్ సంస్థ అలవర్చుకోవాలని, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ వైపు దృష్టి సారించాలని అన్నారుగ్లోబల్ స్థాయికి ఎదిగాలని, ప్రపంచ వ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలని డిప్యూటీ సీఎం అన్నారు. సింగరేణి విస్తరణ ప్రపంచ వ్యాప్తంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాకులపై కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ విధిస్తే బయట ఎవరి చేతిలోకి పోకుండా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని అన్నారు.

గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా సింగరేణి అడుగు పెట్టిందని, ప్రయోగాత్మకంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కూడా నిర్మిస్తామని, రాజస్థాన్ ప్రభుత్వంతో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు.  

స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సింగరేణి సంస్థ సిఎస్ఆర్ క్రింద చేపడుతుందని, నాణ్యమైన బొగ్గు అధిక దిగుబడినిచ్చే సత్తుపల్లి ప్రాంతం నుంచి వస్తుందని అన్నారు.  సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన కిష్టారం, వెంగళరావు నగర్ , ఎన్టీఆర్ కాలనీ తీవ్ర కాలుష్యంతో ప్రజలు శ్వాస కోస ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ఇండ్లు కోల్పోయిన 40కుటుంబాలకు నూతన ఇల్లు నిర్మించామని, మరో 200 ఇండ్లు నిర్మించాల్సి ఉంటుందని అన్నారు. కిష్టారం గ్రామ ప్రజలకు ఆర్&ఆర్ ప్యాకేజీ అందించి మరో చోటుకు తరలించాలని అన్నారు.అంతకుముందు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని  డిప్యూటీ సీఎం కేక్ కట్ చేశారు.అనంతరం డిప్యూటీ సీఎం జివిఆర్ ఓపెన్ కాస్ట్ మైన్ ను పరిశీలించారు.  

ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, సింగరేణి అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >