| Daily భారత్
Logo




సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సైబర్ క్రైమ్ ఏసిపి సిహెచ్.ఆర్.వి ఫణీందర్

News

Posted on 2025-12-23 19:32:47

Share: Share


సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సైబర్ క్రైమ్ ఏసిపి సిహెచ్.ఆర్.వి ఫణీందర్

వ్యక్తిగత గోప్యత చాలా అవసరం : సైబర్ క్రైమ్ ఏసిపి సిహెచ్.ఆర్.వి ఫణీందర్

డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లా దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌లు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సైబర్ క్రైమ్ ఏసిపి సిహెచ్.ఆర్.వి ఫణీందర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆన్‌లైన్ లావాదేవీలు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. ఆన్లైన్లో కష్టపడకుండా డబ్బులు రావాలి, తక్కువ టైంలో ధనవంతులం కావాలి అని ఆశపడేవారు సైబర్ క్రైమ్ కు గురవుతారన్నారు. శ్రమలేని డబ్బు సంపాదన ఫ్రాడేనన్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడం, తెలియని మ్యాట్రిమోనీకి ఫోటోలుతో సహా పూర్తి వివరాలు ఇవ్వడం ద్వారా కూడా సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. గతంలో ఆధార్ కార్డుతో తీసుకున్న నీ సిమ్ కార్డు పై వేరేవాళ్లు వాడి నేరం చేశారని ఆకేసు మీ మీద పడిందని భయపెట్టి ఒంటరిగా మాట్లాడాలని, డబ్బులు ఇస్తే క్రైమ్ జరగకుండా చూస్తానని చేసేవి సైబర్ క్రైమ్ లే అన్నారు. ఇలా చదువుకున్న వారు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా సైబర్ మోసాలకు గురవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఫేక్ లింకులు, ఫిషింగ్ మెసేజ్‌లు, లాటరీలు, ఉద్యోగాలు, బహుమతుల పేరిట ఆశ చూపిస్తూ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలను దొంగిలిస్తున్నారని ఏసిపి వివరించారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, తెలియని యాప్లను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా ఓటిపి, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికీ చెప్పకూడదని, తాము బ్యాంక్, పోలీస్ ల ప్రభుత్వ అధికారులమని చెప్పి ఫోన్ చేసే వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడమే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందడానికి ప్రధాన ఆయుధమని తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని వివరించారు. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగితే డబ్బు లేదా డేటాను తిరిగి పొందడం కష్టమవుతుందని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మీడియా కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని ఏసిపి కోరారు. సైబర్ నేరాలపై సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా అనేక మోసాలను నివారించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వ్యక్తులను ఏర్పాటు చేశామని, 7 లక్షల లోపు సైబర్ క్రైమ్ అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఏడు లక్షలు దాటి సైబర్ క్రైమ్ జరిగితే సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫేక్ కాల్స్ వస్తే భయపడకుండా,  అనవసర కాల్స్ కి స్పందించకుండా ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.  ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నామా పురుషోత్తం అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూ జె (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రాం నారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపా రావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకట్రావ్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మహేందర్, ప్రెస్ క్లబ్ కోశాధికారి కళ్యాణ్, సీనియర్ నాయకులు తాళ్లూరి మురళి, ఏలూరి వేణు, పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >