| Daily భారత్
Logo




ఆత్మాభిమానం పేరుతో కవిత కన్నీటి డ్రామా

News

Posted on 2026-01-07 20:02:21

Share: Share


ఆత్మాభిమానం పేరుతో కవిత కన్నీటి డ్రామా

కేసీఆర్ దోచుకున్న దాంట్లో వాటా ఇవ్వలేదన్నదే అసలు బాధ

రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆత్మాభిమానం పేరుతో శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు పెట్టుకోవడం పూర్తిగా డ్రామా అని, కేసీఆర్ దోచుకున్న సొమ్ములో తనకు వాటా ఇవ్వలేదన్నదే అసలు కారణమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్పల్లి, సిరికొండ, ఇందాలవాయి మండలాలకు చెందిన 200 కుటుంబాలకు రూ.2 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ద్రోహులకు ఆసరా ఇచ్చింది కవితే కదా అని ప్రశ్నించారు. ఎందరో ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆమెకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

తెలంగాణపై రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం మోపి, ఫామ్ హౌస్‌ల్లో హాయిగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన రాహుల్ గాంధీ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికీ స్వంత ఇల్లు లేని కుటుంబాన్ని పట్టుకుని అహంకారంగా మాట్లాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కేసీఆర్ మరోసారి ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు.

మహిళలకు ‘స్వశక్తి’ పేరుతో వడ్డీ లేని రుణాలు అందించి స్వావలంబన వైపు నడిపిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, దేశ–విదేశాల నుంచి భారీ పెట్టుబడులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఈ అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్ నేతలకు ఓర్వలేక కళ్లు మండుతున్నాయని, బీజేపీ దేశాన్ని అమ్ముకుంటూ కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. తెలంగాణను రైజింగ్ తెలంగాణగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రానున్న రోజుల్లో స్థలాలు లేని పేదలకు 75 గజాల స్థలంలో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు.

కార్యక్రమం అనంతరం రామడుగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద వరి పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. అలాగే దమ్మన్నపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఇమ్మడి గోపి, దర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ చెలిమెల మల్లికార్జున్, జనార్ధన్ రెడ్డి, తహసీల్దార్ టి. శాంత, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, మండల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >