Posted on 2026-03-09 19:22:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలి..యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు. పట్టణంలో భగవాన్ దాస్ కాలనీ నందు నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా, మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారి అధ్వానంగా మారిందని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ చెత్త చదారాలతో,వ్యసన పరులకు విలాసవంతం భవనం గా మారిందని, వ్యసనపరులు కమ్యూనిటీ హాల్ లోపల గౌరవప్రదంగా పెట్టుకున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచే విధంగా కిందపడేసి విగ్రహ పెచ్చులు ఊడదీశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమని, ప్రభుత్వానికి ఎస్సీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి మహనీయుల మాసం ఐన ఏప్రిల్ నెలలోపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై దశల వారి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలు తదితరులు పాల్గొన్నారు
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >