Posted on 2026-03-09 19:45:58
ప్రజావాణికి 179 దరఖాస్తుల రాక
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 179 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 53, గృహ నిర్మాణ శాఖకు 29, డీఆర్డీఓ – 20, సంక్షేమ శాఖకు – 14, జిల్లా పంచాయతీ కార్యాలయం, ఎండీ సెస్ – 12, ఉపాధి కల్పన శాఖ, వైద్య శాఖ, ఈఈ పీఆర్ కు చొప్పున – 04, పౌర సరఫరాల శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు మూడు చొప్పున - 03, విద్యా శాఖ, ఈఈ ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, మిషన్ భగీరథకు రెండు చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఎక్ష్సైజు శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, డీపీఆర్ఓ, పశు సంవర్ధక శాఖ, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి తదితరులు పాల్గొన్నారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >