| Daily భారత్
Logo




మెదక్ జిల్లా వ్యాప్తంగా 396 చెరువులు నిండాయి : కలెక్టర్ రాహుల్ రాజ్

News

Posted on 2024-09-01 14:18:48

Share: Share


మెదక్ జిల్లా వ్యాప్తంగా 396 చెరువులు నిండాయి : కలెక్టర్ రాహుల్ రాజ్

డైలీ భారత్, మెదక్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

అధిక వర్షాలకు ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు జిల్లా

 యంత్రాంగం ఎటువంటి సంఘటన జరిగిన  ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. అనంతరం 396 చెరువులు వర్షాల కారణంగా పూర్తిగా నిండినవి అని పేర్కొన్నారు అనంతరం విద్యుత్ ప్రమాదాలు సంభవించొద్దు, ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పగడ్బందీగా చర్యలు రెవిన్యూ, పంచాయతీరాజ్ ,పోలీస్ ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ సమన్వయంగా పనిచేయాలని సూచించారు అదేవిధంగా అధిక వర్షాల పై జిల్లాలోని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తో కలిసి ఆర్డీవోలు ,ఎంపీడీవోలు, తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్స్ అన్ని శాఖల అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేశారు  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుందని ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. పొంగే వాగులు, రహదారులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. శిథిలావస్థలో నివాసం ఉంటున్న ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని  తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. 

 అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు.  

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

సంఘటనలు జరిగిన తర్వాత మేల్కొనకంటే ముందే ఆ సమస్యను గుర్తించినట్లయితే తద్వారా పరిష్కారం సులభతరం అవుతుందని చెప్పారు

ధూప్ సింగ్ తండా వాగుల మధ్యలో ఉన్నదని అధిక వర్షపాతం నమోదు అయితే తాండా మొత్తం కట్ ఆఫ్ అయిపోతుందని లోతట్టు ప్రాంతాలను గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు

జిల్లాలో 396 చెరువులు పూర్తిగా నీటితో నిండిపోయినవని ఏ సమయంలోనైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు జిల్లాలో చెరువులు మండలాల వారీగా లిస్ట్ తయారుచేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం అందజేయాలని అటువంటి లిస్టును మండలాల్లో ఎంపీడీవో ఎంఆర్ఓ లకు అందజేయడం జరుగుతుందని, తద్వారా చర్యలు తీసుకోవచ్చు అన్నారు.

స్ట్రీమ్స్ కెనాల్స్ , కాస్ వే, బ్రిడ్జెస్, రోడ్స్, కల్వర్ట్స్ ఓవర్ ఫ్లో అయితే రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ సమన్వయంగా వ్యవహరించి ప్రజలను ఎవరిని అక్కడికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు

వర్షాలు కారణంగా  పురాతన ఇండ్లు కూలిపోయే అవకాశం ఉన్న వాటిని ముందే గుర్తించి అక్కడ నివాసం ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ భవనాలలో పునరావాసం ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నారు

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా  విద్యుత్ స్తంభాలను ఎవరూ తాగకుండా లూజ్ వైర్స్ ను, ఎలక్ట్రిసిటీ అధికారులు ముందే గుర్తించి ముందే టాంటాం చేయించి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా విషయంలో కలిసితం కాకుండా చూసుకోవాలని పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు

అధిక వర్షాలపై పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంలో విద్యాశాఖ అధికారి తో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు.

అత్యవసర సేవలకు ప్రజలకు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేయు విధంగా  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9391942254 కంట్రోల్ రూము నంబర్లుకు కాల్ చేయాలని తెలిపారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో అన్ని శాఖల జిల్లా అధికారులు మండల తాసిల్దార్లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >