Posted on 2025-12-23 19:29:32
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు బిఎస్ రామయ్య నగర్ గ్రామస్తులతో మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించి కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల తో గుండగిరి చేస్తూ సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా కొంతమంది సభ్యులతో కుమ్మక్కై ఇసుకను డంపింగ్ చేస్తూ ఆగడాలు సృష్టిస్తున్నాడని,అదేవిధంగా మహా గ్రామసభ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కొందరు సభ్యులు కాంట్రాక్టర్ కి కొమ్ము కాస్తూ సొసైటీలో ఉన్న 49 మంది సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇసుక డంపు చేసి ఆదివాసీ మహిళల ఉపాధిని దెబ్బతీస్తున్న కాంట్రాక్టర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని, మహా గ్రామసభ తీర్మానం తర్వాత పాలకవర్గo ఏర్పడిన తర్వాత ఇసుక క్వారీ ప్రారంభించాలని, ప్రస్తుతం కాంట్రాక్టర్ గా ఉన్న అగ్రిమెంట్ ను రద్దు చేయాలని.అలాగే డి సి ఓ ఆఫీస్ లో పెట్టిన దరఖాస్తును పరిశీలించిన తర్వాతే బిఎస్ రామయ్య నగర్ ఇసుక క్వారీ ప్రారంభించాలని, చర్ల ఆదివాసి జేఏసీ చర్ల తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయం పై ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని,ఆదివాసీ సేన రాష్ట్ర కో కన్వీనర్ యలకం. రామకృష్ణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఇర్ప. ప్రకాష్ చర్ల మండల మాజీ ఎంపీపీ గోంది. ముయన్న మాజీ సర్పంచ్ కారం. కన్నారావు ఆదివాసీ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ సోడి. సురేష్ పాల్గొన్నారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >