Posted on 2024-09-01 17:25:13
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నిన్నటి నుండి భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాడుబడిన, శిథిలఅవస్థలో ఉన్న ఇంటిలో కానీ ఇంటి గోడల వెంట కానీ ఎవరు ఉండరాదని,శాంతి నగర్,శ్రీనగర్ కాలనీ, రాజీవ్ నగర్, పద్మనగర్ వెంకంపేట, సంజీవయ్య నగర్ వంటి మొదలగు లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని మెరుపులు ఉరుములు వచ్చే క్రమంలో ప్రమాదం జరిగే ముప్పు ఉన్నందున ప్రజలు రైతులు చెట్ల వద్ద, విద్యుత్ స్తంభల వద్ద, సెల్ టవర్స్ వద్ద ఉండవద్దని, సాధ్యమైనంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని వర్షంలో వర్షంపు నీటి ప్రవాహాలలో నాలాలు మురికి కాలువల వెంట తిరగరదని హెచ్చరించారు... అదేవిధంగా వార్డులలో ప్రజలకు ఈ వర్షాల వల్ల ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి గాని వారి కౌన్సిలర్ దృష్టికి గాని తీసుకవస్తే సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు..
ఎవరివైన ఇండ్లు దెబ్బతిన్నట్లయితే వారు ప్రస్తుతం వారికి దగ్గరలోని కమ్యూనిటీ హాల్లో ఉండవచ్చని అన్నారు..
శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అన్నారు. మున్సిపల్ సిబ్బంది ద్వారా నాలాలను పర్యవేక్షిస్తూ ఎక్కడ వర్షపు నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండ చూస్తున్నాం అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వార్డ్ ల లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >