Posted on 2024-09-02 12:30:50
షాద్ నగర్ చౌరస్తాలో మొహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ వర్ధంతి
వర్ధంతి వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయననీ జనం గుండెల్లో గూడు కట్టుకొని నిత్యం ప్రజా పూజలు అందుకుంటున్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు కొనియాడారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. చెన్నయ్య, వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని మహమ్మద్ ఇబ్రహీం సంయుక్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ..
జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయననీ, సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం అని కొనియాడారు. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం ఆయన పేరని, జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కుదిపివేసిందని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఉచిత కరెంటు, ఉచిత బియ్యం లాంటి ఎన్నో సేవా పథకాలను ప్రజల ముందుకు తెచ్చి అపర భగీరధుడుగా ప్రజల గుండెల్లో సుస్త్రస్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, యాదయ్య యాదవ్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, శ్రీకాంత్ రెడ్డి, అగనూరు బస్వం, కుమార్ స్వామీ, డంగు శ్రీనివాస్ యాదవ్, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, అందే మోహన్, సింగారం సుదర్శన్, ఇబ్రాహీం, లింగారెడ్డిగూడెం అశోక్, సీతారాం, ముబారక్ అలీ ఖాన్, సయ్యద్ ఖదీర్, గంగమోని సత్తయ్య, నడికుడ యాదగిరి యాదవ్, చంద్రశేఖర్, అక్కిగారి శ్రీధర్,జగదీశ్వర్ ముదిరాజ్,మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు..
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >